పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, పేరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి, 20 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి, వారి పేరుతో జనన ధ్రువ పత్రం పొందటానికి గడువు, ఈ నెల 21తో ముగుస్తుంది. ఇప్పటికీ పేరు నమోదు చేసుకోని వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం, జనన మరణ నమోదు కేంద్రం వద్ద వివరాలు అందించి, జనన ధ్రువపత్రం, పేరుతో సహా పొందవచ్చునని, కమిషనర్ పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు.
పేరు నమోదుకు ఆఖరి అవకాశం
కమిషనర్ పార్థసారథి