Telugu News Power

నేడే యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.

భీమవరం: (తెలుగున్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని, సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. గుంటూరు ఏసీ కళాశాల లో రెండు రోజులు పాటు ఈ మహాసభలు జరుగుతాయి. యుటిఎఫ్ స్వర్ణోత్సవాలు పూర్తి చేసుకుని, కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా జరిగే సభలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ, బొర్ర గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు, ఎం హనుమంతరావు,ఎం. కళాధర్, ఎన్ వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసరావు తదితర రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. సంఘ సభ్యులు,రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై,ఈ సభలో తీర్మానాలు ప్రవేశపెడతారు పేర్కొన్నారు.