యలమంచిలి: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అడవి పాలెం గ్రామంలో, సంక్రాంతి సంబరాలు సందర్భంగా, చెడుగుడు పోటీలు జరుగుతున్నాయి. నిమ్మల రామానాయుడు చెడుగుడు పోటీలు, మండల రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నరు. నేటితో ఈ పోటీలు ముగియనున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జట్లు హోరాహోరిగా, ఫ్లడ్ లైట్ల వెలుగులో తలపడుతున్నాయి. సుఖీభవ నర్సింగ్ హోమ్, డాక్టర్ చెరుకూరి సురేష్ బాబు, మొదటి బహుమతికి 50 వేలు, ముత్యాల అనంతలక్ష్మి శివ, రెండవ బహుమతికి 40 వేలు,వెంకటేశ్వర ఏజెన్సీ, వైభవ్ రెస్టారెంట్ వారు,మూడో బహుమతికి, 30 వేలు, నాలుగో బహుమతి, గుత్తికొండ కిషోర్, 25 వేలు, వారాహి డెవలపర్స్, బోనం పరమేశ్వరరావు, చేగొండి శ్రీనివాస్,5వ బహుమతి 20 వేలు, 6వ బహుమతి వర్ధనపు లక్ష్మయ్య (కువైట్ మామ) 15 వేలు, తిరుమల డైయరీ డిస్ట్రిబ్యూటర్, దేవరపు దుర్గా శంకర్, పాలకొల్లు,7వ బహుమతి, 10వేల రూపాయలు అందజేస్తున్నారు. బొలిశెట్టి రాధాకృష్ణ అండ్ సన్స్, వేగేస్న రంగరాజు, అన్న కనమర్లపూడి సుబ్బారావు, ముప్పర్తి సత్తిబాబు నాగార్జున, కర్రి,ప్రసాద్, వెంకటేశ్వరరావు, ఈమని రమేష్, పిల్ల గోపి, పొట్టు పోతూ శ్రీనివాస్ సౌజన్యం అందించారు. ఈ సందర్భంగా వారు అందరికీ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు. విద్యార్థులకు శనివారం రాత్రి బహుమతి ప్రధానోత్సవం చేస్తారు.
అడవిపాలెంలో రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు
అడవిపాలెం చెడుగుడు పోటీలు