Telugu News Power

యలమంచిలిలో ముగ్గులు పోటీలు.

ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానం

యలమంచిలి: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా, పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు శనివారం మండల కేంద్రమైన యలమంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగాయి. ఈ పోటీల్లో సుమారు వందమంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల ద్వారా వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించారు.వారు వేసే రంగులు, భావనలు ఎంతో ఆకట్టుకున్న కొన్నాయి. సాంప్రదాయ శైలిని ప్రతిబింబించాయి. పోటా పోటీగా ఉన్న ఈ ముగ్గులను చూసి, న్యాయనిర్నేతలు, బహుమతులు ప్రకటించటానికి, సమయం తీసుకోవాల్సి వచ్చింది.ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్, మండల టిడిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మామిడి శెట్టి పెద్దిరాజు, తమ్మినీడీ శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి బోనం నాని, సర్పంచ్ ల చాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపాల రావు, చిలుకూరు శ్రీనివాస్, మాతా రత్నరాజు, పాలకొల్లు మున్సిపాలిటీ మాజీ ఉపాధ్యక్షులు, కర్నేని రోజా రమణి, రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గులు పరిశీలిస్తున్న న్యాయనిర్నేతలు