Skip to main content

Telugu News Power

టైగర్ మార్షల్ ఆర్ట్స్ పవన్ కళ్యాణ్

టైగర్ ఆఫ్ మార్షల్ బిరుదు ప్రధాన పత్రం అందుకుంటున్న పవన్ కళ్యాణ్

అమరావతి: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ కు,గోల్డెన్ డ్రాగన్ సంస్థ, టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ప్రధానం చేసింది. సుగోబూడో, 5వ డాన్ గౌరవాన్ని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగినది. జపాన్ కు చెందిన ప్రాచీన యుద్ధకళ, కేంజుట్స్, లో అధికారిక ప్రవేశం ద్వారా ఈ బిరుదు అందుకున్నారు. అవార్డు ప్రధాన ఉత్సవంలో భాగంగా,ఖడ్గం, ధ్రువీకరణ పత్రం బహుకరించారు.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉంది. గతంలో అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి చిత్రాలలో ప్రదర్శించిన ఒళ్ళు గగుర్పోడి పొడిచే,మార్షల్ ఆర్ట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టైగర్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు అందుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.