Telugu News Power

యువతను చెడు వ్యసనాలకు దూరం చేసేది, క్రీడలు మాత్రమే – మంత్రి నిమ్మల పాలకొల్లు: జనవరి,11 (తెలుగు న్యూస్ పవర్)


యువతను చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క క్రీడలకు మాత్రమే ఉందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బి ఆర్ యం వి, హై స్కూల్, అల్లు వెంకట సత్యనారాయణ కళామందిరం వేదిక వద్ద ఆదివారం క్రీడా సంబరాలు నియోజకవర్గం స్థాయిలో, భారీ సంక్రాంతి సంబరాల ప్రారంభం, ఆదివారం ఘనంగా జరిగింది. ఈ క్రీడోత్సవాలకు జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీమ్ హస్మి,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా ధర్మారావు ఫౌండేషన్ తరపున, ఎమ్మెల్యే కప్ సంక్రాంతి ఉత్సవాలు, జరుగుతున్నట్టు వెల్లడించారు. తెలుగువారి సంస్కృతికి సాంప్రదాయాలకు ఈ ఉత్సవాలు ప్రతిబింబమని తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలతో నియోజకవర్గస్థాయిలో సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలుకుతున్నట్టు వివరించారు. దాదాపు 30 టీములతో, మహిళలు, పురుషుల క్రీడా పోటీలు, సుమారు 18లక్షల ప్రైజ్ మనీ తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ గురువు కలిదిండి రామరాజు, ఆడిటర్ రామరాజు, తనకు టికెట్ లభించడం దగ్గర నుంచి, హ్యాట్రిక్ విజయం సాధించడం వరకు తనకు ఎంతగానో సహకరించారని, తండ్రిలా అక్కున చేర్చుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. వారి స్మారకంగా ఈ క్రీడోత్సవాలకు కలిదిండి రామరాజు టోర్నమెంట్ గా నామకరణం చేసినట్టు వెల్లడించారు. ఈనెల 14న పెద్ద ఎత్తున నిర్వహించబోయే సాంప్రదాయ సంక్రాంతి పండుగ వేడుకకు అందరూ హాజరు కావాలని కోరారు జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల వల్ల, యువత స్ఫూర్తిని పొందుతారని వెల్లడించారు.

మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజా ప్రతినిధులు సేవలకు ఒక నిర్దిష్టమైన ప్రమాణాన్ని ఆచరించి చూపారన్నరు. నిరంతరం ప్రజల కోసం పరితపించే నిమ్మల ఆధ్వర్యంలో ఆనాటి బుడమేరు సమస్య పరిష్కారంగాన్ని పోలవరం పనులు పరిగెత్తించడంలో గాని వీరి సేవలు అనితర సాధ్యమని ప్రశంసించారు. జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి మాట్లాడుతూ, అత్యంత క్లిష్టమైన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ, పార్టీ పదవులు మోస్తూ, సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు నిర్వహించటం, ఎలా సాధ్యమవుతుందో, తెలుసుకోవడంలో తమకు స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడోత్సవాల ప్రారంభానికి గుర్తుగా బెలూన్ పావురాలు గాల్లోకి ఎగరవేశారు. కలెక్టర్ నాగరాణి క్రీడోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా 40 జట్లకు, క్రికెట్ వాలీబాల్ కిట్లు ఉచితంగా అందజేశారు. ఇదే వేదికపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, ఆరోగ్య సంబంధ ఖర్చుకుగాను చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కాశ్మీర్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు, విజయలక్ష్మిరామరాజు, ఏ ఏం సి చైర్మన్ కోడి విజయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు , పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్తి, తుల రామలింగేశ్వర రావు, బోనం చిన్న బాబు, మండల టిడిపి అధ్యక్షులు పాముల రజిని కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, రమేష్ రాజు, పొట్నూరి శ్రీనివాస్, బొప్పన హరికిషోర్, చిలుకూరు బాలాజీ, కడలి గోపాల రావు,ఆర్టీవో దాసి రాజు, డి.ఎస్.పి శ్రీ వేద, పలువురు అధికారులు నాయకులు క్రీడాభిమానులు ఈ కార్యక్రమానికి విశేషంగా హాజరయ్యారు. పోటీలు చూసి, వారిని ప్రోత్సహించారు.