Telugu News Power

సంక్రాంతి సంబరం, జనసముద్రం

సాంప్రదాయ గంగిరెద్దుతో నిర్వాహకులు తాళ్లూరి శ్రీనివాస్

యలమంచిలి: జనవరి,14 (తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి గ్రామదేవత కొలువైన యలమంచిలి, తాడిగరువు తోట వద్ద వేంచేసి ఉన్న అమ్మవారి ఆలయం ఎదురుగా సంక్రాంతి సంబరాలు బుధవారం, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) భోగిమంట వేసి ప్రారంభించారు. యువతులు నింబడైన తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చారు. ఉదయం నుంచి ఎక్కడెక్కడ నుంచో పిల్లాపాపలతో ఈ సంక్రాంతి సంబరాలతో పాలుపంచుకోవడానికి తరలివచ్చారు. ఇసుక వేసినా రాలనంత జనం రావడంతో, రాకపోకలు మొత్తం స్తంభించిపోయాయి. ఉదయం అల్పాహారం దగ్గర నుంచి, భోజనాల వరకు వేలమంది బారులు తీరారు. సంక్రాంతి సాంప్రదాయ వంటకాలు రుచి చూశారు. వీటిని నిర్వాహకులు ఉచితంగా అందించారు. శాస్త్రీయ నృత్యం ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తాళ్లూరి శిరీష శ్రీనివాస్ బహుమతులు ఉచితంగా పంచారు. దాదాపు రెండున్నర లక్షల తో స్టేజి ఈవెంట్, సినీ నేపథ్య సంగీత నృత్యం చూడడానికి యువత ఎగబడ్డరు. చిన్న మోటార్ సైకిల్ దగ్గరనుంచి, పెద్ద రంగులరాట్నం, (జయింట్ వీల్) వరకు ఇక్కడ ఏర్పాటు చేశారు. గుండు బల్లల దగ్గర యువతులు సరదాగా డబ్బులు కాసారు. సాయంత్రం వరకు కోడిపందాలు జరిగాయి.ఈ కార్యక్రమాలను నిర్వాహకులు తాళ్లూరి శ్రీనివాస్, తాళ్లూరు వెంకటేశ్వరరావు, బొప్పన రాంబాబు,తాళ్లూరు చందు, బొల్లంపల్లి శ్రీనివాస్, చిలుకూరి శ్రీనివాస్, చిలుకూరి ఆంజనేయులు,ఆకులు ఏసు, తదితర ఎందరో కమిటీ కుర్రాళ్ళు వేలాదిగా వచ్చిన, సందర్శకులకు, నిరుత్సాహ పడకుండా ఏర్పాటు చేయడానికి, విపరీతంగా శ్రమిస్తున్నారు. సందర్శకులకు, ఇక్కడ ఏర్పాటుచేసిన పూల అలంకరణలు, బొమ్మల దగ్గర నుంచి, ఊయల వరకు రకరకాల ఆటపాటలు చూసి ఆనందంతో, పిల్లా పాపలు గంతులు వేశారు. కొత్తజంటలు, యువతీ యువకులు, స్నేహితులు తమ జ్ఞాపకాలను, సెల్ఫీ సెల్ఫోన్లో భద్రం చేసుకున్నన్నారు. కులమతాలకతీతంగా, అతిధిదేవులకు మర్యాదలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి గత కొన్ని ఏళ్ల నుంచి ఇష్టంగా ఇక్కడకుకు అతిధులు తరలి వస్తున్నారు. ఇక్కడ వచ్చే వారికి ఏ లోటుపాట్లు లేకుండా చూడవలసిందిగా, నిర్ణయం తీసుకున్నట్టు వైజాగ్ బుజ్జి తెలిపారు.

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్న వారికి బహుమతులు పంచుతున్న తాళ్లూరి శిరీష శ్రీనివాస్