న్యూఢిల్లీ: జనవరి,15(తెలుగు న్యూస్ పవర్)
జపనీయుల యుద్ధకళ, కెన్ జుట్సషు లో విశిష్టమైన స్థానం సంపాదించినందుకు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో అభినందనలు తెలిపారు. , అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రజా జీవితంలో నిరంతరం తీరికలేకుండా ఉన్నప్పటికీ, యుద్ధ విద్యవలో నిరంతర సాధన, నిబద్ధత, క్రమశిక్షణతో ఈ ఘనత సాధించారన్నారు. దశాబ్దాలుగా, ఈ యుద్ధ విద్య, నిరంతర సాధన ప్రశంసనీయమన్నారు. ఎంత తీరిక లేకుండా ఉన్న, సాధించడానికి, జీవిత పర్యంతం నేర్చుకోవడానికి అవకాశం ఉందనే బలమైన స్ఫూర్తి సందేశాన్ని యువతకు అందిస్తుందని పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల భౌతికంగా బలంగా ఉండటమే కాకుండా, మానసిక సమతౌల్య స్థితి, సహనం, అంతర్గత క్రమశిక్షణ అలవడతాయన్నారు. ఈ కఠోర సాధన ఆత్మ సాక్షాత్కారానికి దారులు తీస్తుందన్నారు. భారతదేశము ఆశిస్తున్న ఫిట్ ఇండియా ఉద్యమానికి, నాయకులు ఆదర్శవంతంగా నిలవవలసిన అవసరం ఉందన్నారు. మీ వ్యక్తిగతమైన,శారీరక ఫిట్నెస్, క్రమశిక్షణ, ఇతరులను కూడా తమ ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల, వారి శ్రేయస్సుకు స్ఫూర్తి ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాబోయే కాలంలో మరెన్నో ఇలాంటి విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
