పాలకొల్లు: జనవరి,17(తెలుగు న్యూస్ పవర్) అసలే పండగ రోజులు, ఆపై శనివారం సంత రద్దీ, దొంగలకు బాగా కలిసి వచ్చింది. నరసాపురం డిపోకు చెందిన, పాలకొల్లు-ఏలూరు రూటు, ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ సొత్తు పోగొట్టుకున్నారు. పండగ సందర్భంగా పుట్టింటికి, పాలకొల్లు వచ్చిన పోలిశెట్టి అరుణ కుమారి, తిరుగు ప్రయాణంలో ఏలూరు బస్సు ఎక్కారు. పూలపల్లి దగ్గర, పర్సు చూసుకోగా 10 కాసుల బంగారం పోయినట్టు గమనించారు. యలమంచిలికి చెందిన, తాళ్లూరి సాయి పద్మజ, లక్షన్నర రూపాయల విలువైన డైమండ్ లాకెట్, 2 గ్రాముల బంగారు వస్తువు, 5 వేల,నగదు ఇదే బస్సులో పోగొట్టుకున్నారు. వెంటనే ఆర్టిసి బస్సు పాలకొల్లు పోలీస్ స్టేషన్కు తరలించగా తనిఖీ చేశారు. ఏ విధమైన ఆధారాలు లభించలేదు. కొందరు మహిళలు బస్సు కదిలిన కొంతసేపటికే దిగిపోయినట్టు చెబుతున్నారు. ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించగా పూలపల్లిలో బస్సు ఆగదు అంటున్నారని, దిగిపోయామని చెప్పారన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టిసి బస్సులో దొంగల చేతివాటం.
సొత్తు పోగొట్టుకున్న మహిళలు