Telugu News Power

పాలకొల్లు-దొడ్డిపట్ల ఆర్ అండ్ బి రోడ్డు పనులు ప్రారంభం

పాలకొల్లు-దొడ్డిపట్ల రోడ్డు పనులు చేస్తున్న దృశ్యం

యలమంచిలి:జనవరి,21(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుచి దొడ్డిపట్ల పోవు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో గల రోడ్డు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, నవంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు కి.మీ.0.000 నుంచి 11.600 వరకు అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం 5 కోట్ల రూపాయల ఎస్ హెచ్ ప్లాన్ నిధులు మంజూరు చేయించారు. ఈ పనులు స్థానిక అడ్డాల వెంకటరత్నం నగర్, పెట్రోల్ బంకు దగ్గర నుంచి ప్రారంభించారు. రోడ్డు పని జరుగుతున్నప్పటికీ వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. ఈ రోడ్డు వెంబడి,నివాస ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నారు.