Telugu News Power

ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – మంత్రి నిమ్మల రామానాయుడు.

మంచినీటి సరఫరా పైప్ లైన్ పనుల గురించి సమీక్షిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి, 21(తెలుగు న్యూస్ పవర్) ప్రజారోగ్యమై కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజలు కలుషిత జలం తాగడం వల్ల వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుగాను అమరజీవి జలధార పథకం ద్వారా 1400 కోట్లు నిధులు మంజూరు చేయించారు. మంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించి, గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజనీర్లు, సంబంధిత ఏజెన్సీ తో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు నాణ్యత తో, వేగం గా పూర్తి చేయాలిని అధికారులకు సూచించారు. గోదావరి నీరు, కాలువల ద్వారా రావడం వల్ల ఎక్కువ కలుషితం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం, గోదావరి మొగలో ఉన్న విజ్జేశ్వరం దగ్గర ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, తదితర వ్యవస్థను, అక్కడే, చేపడతారు. అక్కడ నుంచి శుద్ధి చేసిన మంచినీటిని పైప్ లైన్ ద్వారా గ్రామీణ ప్రాంతల, ముఖ్యంగా శివారు ప్రాంతాలకు రక్షిత జలాలను నేరుగా పంపిస్తారు. ఇందువల్ల, స్వాతంత్రం వచ్చిన దగ్గర్నుంచి, సురక్షిత జలాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ఆ కల కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుంది.