పాలకొల్లు: జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) రోడ్డు భద్రత పై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండటం, బాధ్యతగా భావించాలని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి సూచించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో, ట్రాఫిక్ వారోత్సవాలు భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్, కే రజని కుమార్, మాట్లాడుతూ, హెల్మెట్, సీట్ బెల్ట్, ధరించడం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం మంచిదని, సూచించారు. సబ్ ఇన్స్పెక్టర్, జి.ప్రసాద్, రహదారి ప్రమాదాల నియంత్రణలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా, చిత్రలేఖన పోటీలు జరిపి, విజేతలకు బహుమతులు అందజేస్తామని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో టి కృష్ణ, కె భద్రాచలం, ఎం రామకృష్ణ, వి విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
రోడ్డు భద్రత అవగాహన సదస్సు