అమరావతి; జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, పుష్కరాల ఏర్పాట్లపై అత్యున్నత స్థాయి తొలి సమావేశం శుక్రవారం జరిగింది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 తేదీ వరకు 12 రోజులపాటు పుష్కరాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గోదావరి నది ప్రవహించే, పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఈ ఆరు జిల్లాల్లో చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, పొంగూరి నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పుష్కరాల ఏర్పాట్లపై తొలి సమావేశం.
పుష్కర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమావేశం