Telugu News Power

పాలమూరు రక్షిత మంచినీటి పథకం ప్రారంభించిన మంత్రి నిమ్మల

పాలమూరు రక్షిత మంచినీటి పథకాన్ని, అంగర తో కలిసి ప్రారంభిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం పాలమూరు గ్రామ రక్షిత మంచినీటి పథకాన్ని, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, ఏడదిన్నరలోనే సుమారు 61 లక్షల వ్యయంతో ఈ పథకాన్ని పూర్తి చేశారు. ఇక్కడ నీటి స్వచ్ఛత గురించి ప్రజలకు సమగ్రంగా వివరించారు. దగ్గులూరు లో50.40 లక్షలు, గవరపేట 40.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీరు పథకాలు ప్రారంభించారు. పైపులైన్లు, కుళాయిల ఏర్పాటుకు సంబంధించి, 15 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, ఎమ్మార్వో ఎడ్ల దుర్గ కిషోర్, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వర రావు, పలువురు ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

నీటి స్వచ్ఛత తేడాలు చూపిస్తున్న మంత్రి నిమ్మల