Telugu News Power

పాలకొల్లు టిడిపికి పలు జిల్లా పదవులు.

అభినందనలు అందుకుంటున్న మాత రత్నం రాజు చిట్టూరి ఆంజనేయులు

భీమవరం: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) తెలుగుదేశం పార్టీ, పశ్చిమగోదావరి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం, భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ ఇన్ లో ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎస్ ఎస్ ఐ డి సి, చైర్మన్,మంతెన రామరాజు జిల్లా అధ్యక్షులుగా,వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి పాలకొల్లుకు నియోజకవర్గానికి చెందిన పలువురికి జిల్లా కమిటీలు స్థానం కల్పించారు. దిగమర్రు సాగునీటి సంఘం అధ్యక్షులు, ఎలమంచిలి మండల, టిడిపి సీనియర్ నాయకులు మాతా రత్నం రాజు, టిడిపి అధికార ప్రతినిధిగా రెండోసారి నియమితులయ్యారు. పాలకొల్లు వ్యవసాయమార్కెట్ కమిటీ, మాజీ వైస్ చైర్మన్, ఎలమంచిలి మండలం సీనియర్ టిడిపి నాయకులు చిట్టూరి రామాంజనేయులు జిల్లా ఉపాధ్యక్ష పదవి నూతనంగా చేపట్టారు. మాజీ కౌన్సిలర్ బత్తుల మేరీ నిర్మలకుమారి, బండారు ఆదిలక్ష్మి, బందెల భాస్కర రావు తదితరులు జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యురాలు, ఉమ్మడి జిల్లా టిడిపి మాజీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి, మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, కర్నూల్ నాయుడు దంపతులు, పలువురు టిడిపి నాయకులు వీరిని అభినందించారు.