Skip to main content

Telugu News Power

సైబర్ దోపిడీ నుంచి ఎస్బిఐ రక్షణ

పాలకొల్లు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) సైబర్ నేరగాళ్లు, ఆధునిక టెక్నాలజీని, అమాయకుల సొమ్ము దోచుకోవడానికి అడ్డదారుల్లో వాడుతున్నారు. ఖాతాదారుల, బ్యాంకు ఖాతాల్లో నుంచి అనేక మోసపూరిత మార్గాల్లో సొమ్ము దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలు, ఏడాదికి,లక్షల కోట్లలో ఉంటున్నాయి. ఇతర మార్గాల్లో సొమ్ము రికవరీ పొందడానికి చేస్తున్న మార్గాలు ఉన్నా, జాప్యం అవటం, సామాన్యులకు ఆ విధానం కూడా తెలియక పోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ తరహా మోసాల నుంచి తన ఖాతాదారులను రక్షించుకునే నిమిత్తం, భారతీయ స్టేట్ బ్యాంక్ ఇటీవల నూతన పథకం అమల్లోకి తెచ్చింది. తన ఖాతాదారులకు సైబర్ మోసాల్లో కోల్పోయిన నగదు లక్ష రూపాయలు లోపు వరకు రక్షణ కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ బ్యాంకు ఖాతాదారులు సంవత్సరానికి వెయ్యి రూపాయల,ఇన్సూరెన్స్ చెల్లించవలసి ఉంటుంది. ఖాతాదారులు తమ సొమ్ము సైబర్ చోరీకి గురైందని కనుగొన్న వెంటనే, సంబంధిత బ్యాంకుకు తెలియజేసుకోవాలి. బ్యాంకు ఇన్సూరెన్స్ ప్రతినిధి తగు చర్యలు తీసుకుని, లక్ష రూపాయల వరకు పోగొట్టుకున్న వారికి, నగదు రికవరీ పొందటానికి ఏర్పాటు చేస్తారు. ఈ పాలసీ కి సంబంధించి, ఆధార్, ఫోన్ నెంబర్ వంటి వివరాలు సమర్పించవలసి ఉంటుంది. అవసరం ఉన్నవారు స్టేట్ బ్యాంకు బ్రాంచ్ సంప్రదించవలసిందిగా, బ్యాంకు మేనేజర్లు కోరుతున్నారు.