Telugu News Power

ఘనంగా అడబాల వారసునికి నామకరణ మహోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్)
స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త, అడబాల గ్రూపు సంస్థల అధినేత, అడబాల వెంకటరమణ,వాణి దంపతుల పెద్ద కుమారుడు రోహిత్, కోడలు శ్వేత దంపతుల తొలి సంతానానికి బారసాల,నామకరణ మహోత్సవం, ఆదివారం అడబాల గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. మనవడికి, వేద పండితులు ఆశీర్వచనం చేసి, పూజలు నిర్వహించి, ,”గౌరాన్ష్ అన్వయ్” గా నామకరణం చేశారు. ఈ వేడుకలలో డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ చేగొండి నారాయణరావు బంధుమిత్రులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ అంగర రామ మోహన్ రావు, గుణ్ణం నాగబాబు, గుడాల గోపి,చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, కర్నేని గౌర్నాయుడు, ఎడ్ల తాతజి, చెల్లెం ఆనంద్ ప్రకాష్, పొట్నూరి శ్రీనివాస్, జడ్పిటిసి నడపన గోవిందరాజుల నాయుడు, శంకరాపు శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

నామకరణ మహోత్సవంలోరాజకీయ ప్రముఖులు