Telugu News Power

ఉద్యోగుల 35 వేల కోట్ల బకాయిలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. -రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘం డిమాండ్.

ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు వినతి పత్రం అందిస్తున్న సంఘ నాయకులు
ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసుకు వినతిపత్రం అందిస్తున్న సంఘ నాయకులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే, ఈ ఏడాది బడ్జెట్లో ఉద్యోగులకు చెల్లించవలసిన 35 వేల కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కేటాయింపులు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేపట్టిన ఉద్యమంలో భాగంగా బుధవారం, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి, పితాని సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ ను కలిసి వేరువేరుగా వారికి వినతి పత్రాలు అందజేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం అందించే, ఉద్యమం స్థానిక సంఘ నాయకులు ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగులు దెబ్బలు పడకుండా తీరుస్తారని, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హామి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 35 వేల కోట్ల రూపాయల బకాయిలు, మధ్యంతర భృతి, వేతన సవరణ సంఘం ఏర్పాటు గురించి, క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తానని, స్థానిక, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, కౌరు శ్రీనివాస్, సంఘ నాయకులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు, ఉమర్ ఆలీషా, జిల్లా ఉపాధ్యక్షులు మల్లుల సాయిబాబా, పాలకొల్లు, భీమవరం, తణుకు తాలూకా యూనిట్ల నాయకులు, మంతెన నారాయణరాజు, నరేంద్ర, ఆదిత్య, గాంధీ రెడ్డి, ప్రేమ్ సాయి రవి తదితరులు పాల్గొన్నారు.