Telugu News Power

సామూహిక ఎలుక నిర్మూలన.

ఎలుకలకు ఎరను తయారు చేస్తున్న ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్
ఎలుకల నిర్మూలన కార్యక్రమం వద్ద హాజరైన ప్రజాప్రతినిధులు,రైతులు

పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) వ్యవసాయ శాఖ చేపట్టిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం బుధవారం వివిధ మండలాల్లో జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధ్యక్షులు కోడి విజయభాస్కర్, ఎలుకల నిర్మూలన కోసం స్వయంగా, ఎరను తయారుచేసి ఆగర్తిపాలెం రైతులకు పంపిణీ చేశారు. రైతులకు, కౌలు రైతులకు ప్రభుత్వం ఉచితంగా పంచుతున్న బ్రోమోడియోలిన్ వాడి ఎలకల నుంచి పంటను రక్షించుకోవాలని ‘కోడి’ కోరారు. ఈ కార్యక్రమంలో ఆగర్రు సోసైటీ అధ్యక్షులు జాన్ రాజు, సర్పంచ్ కావలి లక్ష్మీకుమారి, రైతులు వెంకట సత్యప్రసాద్, వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.