Skip to main content

Telugu News Power

దివీస్ కంపెనీలు 7మందికి ఉద్యోగాలు.

ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు
అభ్యర్థులకు సూచనలు ఇస్తున్న,ఛాంబర్స్ కాలేజీ అధ్యక్షులు కేవీ నరసింహారావు,

పాలకొల్లు: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) దివీస్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏడు మంది ఉద్యోగాలు సాధించారు. స్థానిక ఛాంబర్స్ కళాశాలలో గురువారం జరిగిన ఈ ఇంటర్వ్యూలకు 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దివిస్ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పూర్ణ ప్రసాద్, శరత్ అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. విజేతలకు 18 వేల నుండి 24 వేల రూపాయల వరకు వేతనం ఇస్తారు. వీటితోపాటుగా ఇతర అలవెన్సులు, పిఎఫ్, ఈఎస్సై వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు కేవీ నరసింహారావు, కనుమూరి సీతారామరాజు, కోశాధికారి ప్రవీణ్ భాను, ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, డాక్టర్ మూర్తి, నందుల సీతారామారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ యు. జానకి రామయ్య, మీనా తదితరులు పాల్గొన్నారు.