విజయవాడ: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) వేగంగా ముంచుకొస్తున్న ఏఐ ముప్పు వల్ల, సాఫ్ట్వేర్ కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. అంత్రోపిక్ , క్లాడ్ ఐటీ రంగంలో ఉన్న వారికి సుపరిచితమైనది. ఇటీవల ఒక ఏ ఐ ఆటోమేషన్ టూల్ విడుదల చేసింది. ఇందులో 11 రకాల ఓపెన్ సోర్స్, ప్లగ్ఇన్స్ ప్రవేశపెట్టింది. ప్లగ్గిన్స్ అంటే ప్రస్తుతం వాడుతున్న మూల సాఫ్ట్వేర్ కు అనుబంధగా ఉండి, వాటి సామర్థ్యాన్ని మరింత విస్తృత పరుచడానికి ఈ ప్లగ్గిన్స్ దోహదం చేస్తాయి. ఈ టూల్ ప్రవేశపెట్టిన కొద్ది గంటల్లోనే పెను సంచలనం సృష్టించినది. సాఫ్ట్వేర్ రంగం సేల్స్ మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్ వంటి పనులకు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ప్రతి డాక్యుమెంటెషన్ , రివ్యూ చేయడం, అప్రూవల్స్ జారీ చేయడం వంటి పనులను ఈ ప్రక్రియలో ఆటోమేట్ చేసింది. ఇందువల్ల,సాంప్రదాయ సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద కుదుపుకు గురయ్యాయి. చాలామంది ఐటి ఉద్యోగుల్లో ఈ కొత్త ఏఐ టూల్ ప్రవేశం, ప్రకంపనాలు పుట్టించి, తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత ఉద్యోగాలపై క్లాడ్ ఆటోమేషన్ టూల్ చాప కింద నీరులా చొచ్చుకు వచ్చేస్తుంది. ఇప్పటికే చైనా వంటి దేశాల్లో వినియోగంలో ఉన్న ఏ ఐ మోడల్స్, సాఫ్ట్వేర్ రంగానికి భారీ సవాల్ విసరనున్నాయి. ఈ మేరకు, సాఫ్ట్వేర్ రంగానికి చెందినవారు ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త పరిశోధనలకు అనుగుణంగా తమ నైపుణ్యం పెంచుకోవాల్సి ఉంటుందని, ప్రముఖ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు నల్లమోతు శ్రీధర్ వివరించారు.
ముంచుకొస్తున్న ఏ ఐ ముప్పు