Telugu News Power

మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు.

మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులు

పాలకొల్లు: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం,నాయకుల ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, మధ్యంతర భృతి, వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, సిపిఎస్ రద్దు వంటి ముఖ్య విషయాల పరిష్కారానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చినట్టు ప్రతినిధి బృందం తెలిపింది. సంఘ జిల్లా అధ్యక్షులు వై మోహనరావు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ఉమర్ అలీషా, ఉపాధ్యక్షులు మంతెన నారాయణరాజు,జిల్లా ఉపాధ్యక్షులు మల్లుల సాయిబాబా, రాహుల్, మహిళా ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి, పాలకొల్లు తాలూకా యూనిట్ అధ్యక్షులు సునీల్, కార్యదర్శి బి రామకృష్ణ, నరేంద్ర, మంత్రివర్యులను కలిసిన వారిలో ఉన్నారు.