
పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) నియోజకవర్గ ఆడపడచులు రక్షిత మంచినీటి కోసం అడిగే వారిని, వారి ఆశీర్వచనంతో, అధికారంలోకి వచ్చిన, కూటమి ప్రభుత్వం, ఆ కల నెరవేర్చబోతుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నా రు. పోడూరు మండలం,వేడంగి గ్రామంలో 62.35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి పథకానికి, మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏ విధమైన కలుషితం చేరకుండా, గోదావరి నీరు నేరుగా పైపులైన్ ద్వారా ప్రధాన రక్షిత మంచినీటి పథకానికి చేరుతుందన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయటానికి మరో 37.88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. నియోజకవర్గ రక్షిత మంచినీటి పనులకు 110.23 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి, వైయస్సార్ పార్టీ చేస్తున్న, భయానక,అరాచక చర్యలను ప్రజలు ఓ కంట కనిపెట్టి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో, పాలకొల్లు ఏఎంసి ఉపాధ్యక్షులు దాసరి రత్నం రాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, బిజెపి నాయకులు, ఉన్నమట్ల కపర్తి, ఎర్రం శెట్టి పద్మారావు, రాంభద్ర రాజు, రమేష్ రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
