Telugu News Power

ఉద్యోగుల బకాయలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి.

మంత్రి నిమ్మలకు వినతిపత్రం సమర్పిస్తున్న యుటిఎఫ్ నాయకులు

పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను, యుటిఎఫ్ జిల్లా కమిటీ శనివారం కలిసారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయ,ఉద్యోగులకు ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవడానికి శాసనసభలో చర్చించాలని కోరారు. వేతన సవరణకు వెంటనే 12వ కమిషన్ వేయాలని కోరారు. చెల్లించవలసిన డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యంతర భృతి 29% వెంటనే అమలు చేసి చెల్లించాలని కోరారు. మె మో, 57 ప్రకారం 2003 ఉపాధ్యాయులకు, ఓ పి ఎస్ పెన్షన్ చెల్లించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం మంత్రికి సమర్పించారు. పార్టీ,ప్రభుత్వ, శాసనసభ వేదికలపై ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని మంత్రి నిమ్మల రామానాయుడు సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జీవివి రామానుజరావు, కె రాజశేఖర్, దేవరపు ఏసుబాబు, రామభద్రం, పిల్లి శ్రీనివాసరావు, డివీ నరసింహారావు, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు.