
భీమవరం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) పట్టణ ప్రజలు, విద్యావంతులు, దుకాణదారులు ట్రాఫిక్ సమస్య పట్ల అవగాహనతో వ్యవహరించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా భీమవరం పట్టణాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనంపై ఆమె పట్టణంలో, ఎస్పీ, అద్నాన్ నయీమ్ అస్మి, అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భద్రత వారోత్సవాలు వంటి అనేక సందర్భాల్లో ఈ సమస్యపై అవగాహన కల్పించినప్పటికీ, ఫలితాలు రాలేదన్నరు. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ సమస్య పరిష్కారానికి చేస్తున్న కృషి సరిపోవడం లేదన్నా రు. సమస్య పరిష్కారానికి, దుకాణదారులు రోడ్డు ఆక్రమణలు మానుకోవాలని సూచించారు. విద్యావంతులు కూడా రోడ్డుపై అస్తవ్యస్తంగా వాహనాలు నిలపడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ట్రిపుల్ రైడింగ్ ప్రమాదమని హెచ్చరించారు. పర్యటనలో స్వయంగా ఆక్రమణలు గమనించి తొలగింపు చేశారు. ఈ చర్య పట్ల ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తం అయింది.
