పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వద్ద రోటరీ క్లబ్ అధ్యక్షులు, నిక్షయమిత్ర, డాక్టర్ రామకృష్ణ ఆనందరాజు, గర్భిణీ స్త్రీలకు, క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, అదనపు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో వారు తప్పక బలవర్ధక ఆహారం తీసుకోవాలని కోరారు. క్షయ వ్యాధి నివారణ ఇప్పుడు ఎంతో సులువని, ముందుతో పాటు బలమైన ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ నవ్య జీవన్ మాట్లాడుతూ, క్షయ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి, ఆరు నెలలకు సరిపడా మందులు కూడా ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతినెల అందించినట్టుగా, 35 మంది గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లు అందజేశారు. క్షయ వ్యాధి ఉన్న 20 మందికి పోషకాహారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్. రోటరీ అధ్యక్షులు కోసూరి రామకృష్ణ ఆనందరాజు. రోటరీ కార్యదర్శి పోతబత్తుల సత్యనారాయణ. కోశాధికారి గన్న బత్తుల శ్రీనివాస్ రావు.ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు. పి హెచ్ ఎన్ పి. ఎలిజిబెత్. సీనియర్ అసిస్టెంట్ రమేష్ బాబు.ఫార్మసిస్ట్ పీవీ స్వామి. ఎస్ టి ఎస్ కే. సత్తిబాబు. సూపర్వైజర్ జి ఉదయ చందర్. ఎస్.కె అమలేశ్వర రావు. స్టాఫ్ నర్స్ లు ముత్యవల్లి. సౌజన్య. ప్రియాంక. ఎల్ టి లు కే వరప్రసాద్. సిహెచ్ ప్రసాద్ లు. ఏఎన్ఎంలు. హెల్త్ అసిస్టెంట్లు. ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు