పాలకొల్లు: మే, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సెలవు రోజుల్లో యువత, విద్యార్థులు పెడదారి పట్టకుండా, స్థానిక ఆబ్కారి శాఖ శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. గంజాయి, సారా, మత్తుమందుల వచ్చే ప్రమాదాలను వివరిస్తూ, వాటి బారిన పడకుండా కాపాడుకునేలా ఈ అవగాహన కార్యక్రమంలో వివరించారు. స్థానిక టిడ్కో గృహసముదాయం వద్ద, పట్టణ ముఖ్య ప్రదేశాల్లో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఫ్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్ ఐ మహేష్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో నిర్వహించినట్టు ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ వెల్లడించారు.
మత్తు మందులపై ఆబ్కారిశాఖ అవగాహన కార్యక్రమం.
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం