Skip to main content

Telugu News Power

దేశవ్యాప్త సమ్మెకు ఎన్జీజీఓ అసోసియేషన్ మద్దతు.

భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12, 2026న జాతీయ సార్వత్రిక సమ్మె కు
అలాగే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. అనుబంధ సంఘాలన్నీ సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చింది.ఏపీ ఎన్జీ జీవో అసోసియేషన్ సంఘీభావం తెలుపుతున్నట్లు, అధ్యక్షులు గుడాల హరిబాబు,కార్యదర్శి గుబ్బల ప్రసాద్ తెలిపారు.

డిమాండ్లు: నూతన కార్మిక చట్టాల రద్దు,వేతన సవరణ,
పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టం రద్దు,పెండింగ్ బకాయిల చెల్లింపు, కాంట్రాక్ట్ ఉద్యోగులను, ఉద్యోగులుగా నియమించడం,
పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ అమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలకు 62 ఏళ్ల పదవీ విరమణ,
సిపిఎస్ ఉద్యోగుల కోసం మెమో–57 అమలు కోసం దేశవ్యాప్త సమ్మె నేడు జరగనున్నది