కర్నూలు: గురువుగారు 12,(తెలుగు న్యూస్ పవర్)
జాహ్నవి కందుల ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, ఆదోని కి చెందిన విద్యార్థి. ఈమె అమెరికాలో ఎమ్మెస్ చేయటానికి వెళ్లారు. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నడిచి రోడ్డు దాటి వెళుతుండగా, జనవరి5, 2023 ఒక పోలీస్ అధికారి డ్రగ్స్ మత్తులో, 40 కిలోమీటర్ల వేగం వెళ్లవలసిన చోట, వంద కిలోమీటర్ల వేగం మించి, అక్కడ నుంచి వెళ్తున్న జాహ్నవిని ఢీకొట్టాడు. ఆమె వంద అడుగుల దూరంలో పడి, అక్కడికక్కడే మరణించారు. కందుల జీవితం చాలా పరిమితమైన విలువ కలిగి ఉంటుందని క్రూరంగా కెవిన్ దవే అనే పోలీస్ అధికారి. అవహేళన చేశాడు. ప్రమాదంలో జాహ్నవి మరణించిన మూడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, భారతదేశంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు అమెరికా ప్రభుత్వం, 29 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 262 కోట్లు) నష్టపరిహారంగా అందించారు. బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోగా, ఈ నష్టపరిహారం ఏం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేశారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించిన కందుల జాహ్నవికి 262 కోట్లు నష్టపరిహారం.
పోలీసు హంతకుడు కెవిన్ దవే మృతురాలు జాహ్నవి