త్రాగునీటి కొరత లేకుండా చూడాలి.
-కలెక్టర్ ఆదేశాలు
భీమవరం: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) వచ్చే వేసవి నాటికి త్రాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆదేశాలు ఇచ్చారు. స్థానిక వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం మునిసిపల్ శాఖ అధికారులతో కలెక్టర్, నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. త్రాగునీటి నాణ్యత పై ప్రతిరోజు పరీక్ష చేయాలి. మంచినీటి పైపులైన్లు నీ కేజీ లేకుండా చూడాలి. వాటర్ ట్యాంక్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పన్నులు సక్రమంగా వసూలు చేయాలి. దోమల నివారణకు నిత్యం ఫాగింగ్ చేయాలి. పురమిత్ర యాప్ విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పోలవరం మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
త్రాగునీటి కొరత లేకుండా చూడాలి. -కలెక్టర్ ఆదేశాలు
మున్సిపల్ శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్, సంయుక్త కలెక్టర్