Telugu News Power

స్మశాన వాటిక పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు, శ్రమదానం.

యలమంచిలి స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి, సందర్భంగా శివునికి ప్రీతిపాత్రమైన భస్మస్థలి లో ఆదివారం, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్వగ్రాము ఆగర్తిపాలెం, స్మశాన వాటికలో శ్రమదానం చేసి, గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు. ఆఖరి మజిలీ, పవిత్రంగా, ప్రశాంతంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో మంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు కాకుండా, ఇతర సంస్థల నుంచి ఈ లక్ష్యం సాధించడానికి నిధులు సేకరిస్తున్నారు. స్మశాన వాటికలకు మంజూరైన 1.25 కోట్ల రూపాయలతో ప్రారంభించనున్న పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆగర్తిపాలెంలో బయోపోర్ ఫార్మా కంపెనీ, విడుదల చేసిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు 20 లక్షలు, ఓఎన్జిసి, సి ఎస్ ఆర్ నిధులు 15 లక్షల రూపాయలతో స్మశానాన్ని సుందరంగా తీర్చిదిద్దటానికి, ఇతర పనులకు ఈ 35 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఓఎన్జిసి సిఎస్ఆర్ ఫీజులు 15 లక్షల రూపాయలు బగేశ్వర్ స్మశాన వాటిక పనులకు మంజూరు చేశారు. వడ్లవానిపాలెం స్మశాన వాటికకు ఓఎన్జిసి సి ఎస్ ఆర్ నిధులు 15 లక్షలు, పూలపల్లికి 15 లక్షలు యలమంచిలి 15 లక్షల రూపాయలు కేటాయించారు. దొడ్డిపట్ల కు బయో ఫోర్ ఫార్మా వారు సిఎస్సార్ నిధులు ఇంతకుముందే మంజూరు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, మాజీ చైర్మన్, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, గాంధీ భగవాన్ రాజు, మామిడి శెట్టి పెద్దిరాజు, చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, బొప్పన కిషోర్, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి), బొప్పన రాంబాబు, కడలి గోపి, రావూరి మురళీకృష్ణ, తాళ్లూరీ చందు తదితరులు హాజరయ్యారు.

గ్రోయన్స్ తో గోదావరి కోత నిరోధించడానికి స్థల పరిశీలన చేస్తున్న మంత్రి నిమ్మల
మంత్రి స్వగ్రామం ఆగర్తిపాలెం స్మశాన వాటిక పనులకు సూచనలు ఇస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు.