Skip to main content

Telugu News Power

వీఆర్వోల వర్క్ టు రూల్ నేటి నుంచే

వర్క్ టు రూల్ కోసం నినాదాలు చేస్తున్న వీఆర్వోలు

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) వీఆర్వోలు వర్క్ టు రూల్ పాటించి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిగంటలు ఉండాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మండల వీఆర్వో, వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీఆర్వోల ఐక్యత వర్ధిల్లాలని, పని గంటలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇఎఫ్ఎస్ సర్వే, జాయింట్ ఎల్ పి ఎన్, సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్స్ వంటి వివిధ పనులతో వీఆర్వోలకు, తీవ్ర ఒత్తిడి ఎదురవుతుందన్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని మన్నించి పని గంటలు నిర్దిష్టంగా కేటాయించాలన్నారు. వీఆర్వోల సంఘం అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఉపాధ్యక్షులు, ఉండ్రాజవరపు ప్రభాకర్, కోశాధికారి విప్పర్తి సురేష్, పలువురు వీఆర్ఏ, వీఆర్వోలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.