Telugu News Power

నర్సాపురం వద్ద వంతెన నిర్మించాలి. -కాంగ్రెస్ పార్టీ డిమాండ్

నరసాపురం వద్ద వశిష్ట గోదావరిపై వెంటనే నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్

నరసాపురం: ఫిబ్రవరి, 18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వశిష్ట గోదావరిపై వెంటనే వంతెన నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లా బీసీ నాయకులు,కొలకలూరి అర్జునరావు ఆధ్వర్యంలో బుధవారం, వాళ్ళందర్ రేవులో అర్జున్ రావు మాట్లాడుతూ, 2004 నుంచి చాలా ప్రభుత్వాలు మారినప్పటికి, ఇప్పటికీ బ్రిడ్జి నిర్మించకపోవడం పట్ల నిరసన తెలిపారు. సముద్రంలో కూడా బ్రిడ్జిలు కడుతున్న నేటి అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో, నర్సాపురం వంటి చిన్ని గోదావరి నిర్మించలేకపోవటం, ప్రజల్ని మభ్యపెట్టడమేనన్నారు. తాము 2029లో అధికారంలోకి వస్తామని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పారు. అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తామని తెలిపారు. ఇష్ట గోదావరిపై వంతెన రొయ్యలపై తొలి సంతకం చేయిస్తామని వెల్లడించారు. మీ వదిన నిర్మించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.