Skip to main content

Telugu News Power

కత్తి పట్టిన క్షత్రియులు.

శ్రమదానంతో చెట్లు తొలగిస్తున్న దృశ్యం

పాలకొల్లు: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో, ఆఖరి మజిలీ చేసే స్మశాన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సంకల్పించినట్టు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. స్థానిక పూలపల్లి, రాజుల స్మశాన వాటిక ప్రాంతాన్ని భగవాన్ రాజు ఆధ్వర్యంలో పలువురు క్షత్రియులు కత్తి పట్టి శ్రమదానం చేసారు.అడవిలా ఉన్న స్మశాన స్థలాన్ని ఆవరించిన చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా, గాంధీభవన్ రావ్ మాట్లాడుతూ, రాజుల స్మశాన వాటిక సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆక్రములకు గురైంది అన్నారు. శిధిలావస్థకు చేరిన ఈ స్మశానాన్ని తిరిగి సుందరవణంగా తీర్చిదిద్దాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఎక్కడెక్కడో ఉంటున్న వారందరూ, ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజు శ్రీనివాసరాజు, సత్తిపండు రాజు, సీతారామరాజు రామలింగ రాజు, శివాజీ రాజు, శ్రీహరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరిస్తున్న గాంధీ భగవాన్ రాజు