పాలకొల్లు: ఫిబ్రవరి, 18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలం, అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ప్రారంభించారు. గోమాతకు పూజలు చేసి శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, గర్భకోశ శస్త్రచికిత్స, నట్టల నివారణ, గోమార్ల నివారణ, ఉచిత మందులు, ల్యాబ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు.
రైతుల సమావేశంలో మాట్లాడుతూ,స్వచ్ఛమైన పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కల్తీ పాల వల్ల ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు.వ్యవసాయంతో పాటు పాడి ఉంటేనే రైతు ఆర్థికంగా బలపడతాడని తెలిపారు.
ప్రతి ఇంట్లో కనీసం ఒక ఆవు లేదా గేదె పెంచుకోవాలని సూచించారు.
పశువులకు సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ పశువైద్యశాలల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో 2020 లెక్కల ప్రకారం వేల సంఖ్యలో పశువులు, కోళ్లు ఉన్నాయని తెలిపారు. జనవరి 19–30 మధ్య 59 శిబిరాల్లో 1,182 పశువులకు చికిత్స, 2,439 పశువులకు నట్టల నివారణ మందులు అందజేశా.దూడల అందాల పోటీలలో గెలుపొందిన రైతులకు ఏపీ లైవ్ స్టాక్ ఏజెన్సీ సౌజన్యంతో బహుమతులు అందజేశారు.
