
యలమంచిలి: ఫిబ్రవరి,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానికంగా జరుగుతున్న ఏటిగట్టు పనులు ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆరోపించారు. ఏటిగట్టు పక్కనే ఉన్న మట్టి తవ్వి, పైకి వేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ గట్టు బలం లేక కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏటిగట్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని గోపి బుధవారం పరిశీలించారు. ఏటిగట్టు పనులు స్థానిక శాసనసభ్యులు మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గంగడుపాలెంలో 3 తరాలుగా ఉంటున్న, 14 కుటుంబాలను ఖాళీ చేయమనడం దారుణమని విమర్శించారు. వారికి నష్టపరిహారం చెల్లించి, ప్రత్యామ్నాయంగా వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ గారు మండలం ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ గారు,మండల ప్రధాన కార్యదర్శి చల్లా విశ్వేశ్వర రావు (నల్లయ్య )గారు, స్థానిక ఎంపీటీసీ కడలి సునీత నరసింహారావు గారు, గ్రామ అధ్యక్షులు ఇల్లింగి నాగ శీను గారు, కోళ్లు మాధవరావు గారు,కొల్లాటి పెద్దిరాజు గారు, కోరం చిట్టిబాబు గారు, వీరా ఉమాశంకర్ గారు,,గుడాల సురేష్ గారు,జడ్డు నాగరాజు గారు, వలవల ధర్మ రావు, గారు, ఇల్లింగి వర్మ గారు, కుంచె సుందరరావు గారు, రావి రత్నరాజు గారు, బుడితి సుదీర్ గారు, అంకాని మోహనరావు గారు, మేరా బైరవమూర్తి గారు, కడలి పెద్దిరాజు గారు,బుడితి చంటి బాబు గారు, సాయల నాగశ్వర రావు గారు, రావి జేమ్స్ గారు, కొల్లాటి సత్యనారాయణ గారు, కట్టా వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు..