Telugu News Power

రైల్వేవారు దారి వదలాలి రైతులు విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటు గురించి సేకరించిన భూమిలో రైల్వే వారు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏనుగువానిలంక,కలగంపూడి మధ్య ఉన్న 7 ఎకరాలు భూసేకరణలో రైల్వే వారు తీసుకున్నారు. దీనికి సంబంధించి రైతులకు సొమ్ము కూడా అప్పుడే చెల్లించారు. రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు ఇంతవరకు సజావుగా నిర్వహించుకుంటున్నారు. దాళ్వాపంట మాసూళ్లకువస్తున్న సమయంలో కంచ ఏర్పాటు చేయడం వల్ల రైతుల రాకపోకలకు అడ్డంకి ఎదురవుతుందని రైతులు తెలిపారు. దళ్వాపంట చేతికి వచ్చేవరకు తాత్కాలికంగా ఇక్కడ కంచె నిర్మాణం పనులు నిలిపివేయాలని అధికారులను కోరారు. తదుపరి పంట నుంచి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని తెలియజేశారు. ఈ మేరకు, స్థానిక తాశిల్దార్ జి. పవన్ కుమార్, గురువారం వినతి పత్రం అందజేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. రైతులు,ఎం. శ్రీనివాసరావు, ఎం. సత్యనారాయణ, పొత్తూరు రామకృష్ణంరాజు, మల్లుల శ్రీనివాసు, పొత్తూరు సత్యనారాయణ రాజు, కడలి సోమేశ్వరరావు, పొత్తూరు రామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.