యలమంచిలి: ఫిబ్రవరి, 19 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వీఆర్వోల నిరసన కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండల వీఆర్వోలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. జనవరి 12 నుంచి వర్కు టు రూల్ పాటించాలని సంఘం నిర్ణయించింది. వీఆర్వోలు రాత్రి పగలు తేడా లేకుండా బాధ్యతలు నిర్వహించవలసి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇందువల్ల కొందరు ప్రమాదాలకు గురవుతుంటే, మరి కొందరు ఆత్మహత్యలు పాల్పడ్డ సందర్భాలు కూడ ఎదురవుతున్నాయన్నారు. వివిధ రకాల కార్యక్రమాలు ఏకకాలంలో చేయాలని అధికారులు ఆదేశించడం వల్ల విఆర్ఓ లపై పని భారం అధికంగా పడుతుందన్నారు. ఇప్పటికీ అధికారులు పని సకాలంలో చేయలేదని షో కాజు నోటీసులు ఇచ్చి మరింత మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్వోలు ఎవరు ధైర్యం కోల్పోవద్దు అని, రాష్ట్ర సంఘం వారికి అండగా ఉంటుందని హామి ఇచ్చారు. పాసుబుక్కులు హడావిడిగా తయారు చేయడం వల్లతప్పులు తడకగా మారుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సమగ్రంగా సర్వే చేసి, స్పష్టమైన వివరాలతో పాసుబుక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విఆర్వోల సంఘం అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పలువురు వీఆర్వోలు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
తహశిల్దార్ కార్యాలయం వద్ద విఆర్వోల నిరసన.
నినాదాలు చేస్తున్న విఆర్వోలు