కాళ్ళ: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రాతాళ్ళమెరక గ్రామంలో పలు అభివృద్ధి పథకాలకు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీ ఐ ఐ డి సి చైర్మన్, స్థానిక మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు రామరాజు,ప్రారంభోత్సవం చేశారు.
విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్,30వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రాతాళ్ళమెరకలో భారీ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరిగాయి.
కాళ్ల మండలం ప్రాతాళ్ళమెరకలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
సిమెంట్ రోడ్లు, మురుగు నీటిపారుదల వ్యవస్థ, మంచినీటి చెరువు, మైక్రో ఫిల్టర్, పైపులైన్,
సీసీ కెమెరా వ్యవస్థ,చినపేట చెరువు రక్షణ వాల్, వాకింగ్ ట్రాక్, స్వర్గీయ వత్సవాయి రాధామణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్,స్వర్గీయ వత్సవాయి సూర్యనారాయణ రాజు ప్రజా వైద్యశాల పునఃప్రారంభం, అంబులెన్స్ ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘు రామకృష్ణ రాజు మాట్లాడుతూ,గ్రామాభివృద్ధికి దాతల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ జన్మభూమి వికాసానికి తోడ్పడితే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఉపసభాపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్, ప్రతినిధులు, పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హాజరయ్యారు.
కాళ్ల మండలం ప్రాతళ్ళమెరకలో సుమారు ₹3 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తదితరులు సంయుక్తంగా ప్రారంభించారు.
🚧 సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్
💧 మంచినీటి చెరువు, మైక్రో ఫిల్టర్, పైపులైన్
🎥 సీసీ కెమెరా వ్యవస్థ
🌿 చినపేట చెరువు సంరక్షణ వాల్, వాకింగ్ ట్రాక్
🎓 స్వర్గీయ వత్సవాయి రాధామణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
🏥 స్వర్గీయ వత్సవాయి సూర్యనారాయణ రాజు ప్రజా వైద్యశాల పునఃప్రారంభం & అంబులెన్స్
గ్రామాభివృద్ధికి దాతల సహకారం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. “ప్రతి ఒక్కరు తమ స్వస్థలానికి తోడ్పడితే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి” అని ఉపసభాపతి పేర్కొన్నారు.