Skip to main content

Telugu News Power

డ్రోన్ టెక్నాలజీ విద్యుత్ శాఖకు వరం

తీగలు తీసుకు వెళుతున్న డ్రోన్

నరసాపురం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఇటీవల, వ్యవసాయం, ఫోటోగ్రఫీ, అత్యవసర మందులు అవయవాల పంపిణీ తదితర అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న టెక్నాలజీని విద్యుత్ రంగానికి విస్తరింపజేసింది. విద్యుత్ లైన్లు, 33కెవి, 11కేవి, ఎల్ టి లైన్లు లాగడానికి డ్రోన్ ఉపయోగిస్తున్నారు. గతంలో ఈ పనులు మనుషులు చేయటం వల్ల ముఖ్యంగా ప్రమాదాలు జరిగేవి. ఎత్తయిన విద్యుత్ టవర్లపై క్లిష్టమైన పనులు మనుషుల చేయటం కష్టమయ్యేది.
డ్రోన్ టెక్నాలజీ వల్ల పని సులభం కావడమే కాక సమయం సొమ్ము కూడా ఆదా అవుతుంది. భవిష్యత్తులో మరింతగా ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్టు శాఖ అధికారులు తెలిపారు.