Skip to main content

Telugu News Power

శాసనసభను ప్రత్యక్షంగా ,వీక్షించిన ఏ.ఏస్.ఎన్.ఏం విద్యార్థులు.

శాసనసభ వద్ద విద్యార్థులు అధ్యాపకులు

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా,స్థానిక, ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల విద్యార్థులు మంగళవారం వీక్షించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ఆదేశాల మేరకు, కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సభ జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రజాస్వామ్య లో శాసన వ్యవస్థ పనితీరు, బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశ పెట్టడం గురించి అవగాహన చేసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం, వివిధ అంశాలపై చర్చించడం, దానిపై నిర్ణయం తీసుకోవడం గమనించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన శాసన వ్యవస్థ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ సందర్శన ద్వారా వీలు కలిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, అధ్యాపకులు, కే భద్రాచలం, జీడి శ్రీనివాసరావు, సిహెచ్ ఉషారాణి, సిహెచ్ రవికుమార్, నీ
డి మన్మధరావు, పి దుర్గేశ్వరి విద్యార్థులు పాల్గొన్నారు.