Telugu News Power

వరి పరిశోధన శాస్త్రవేత్తలతో కలెక్టర్ సమావేశం.

కొత్త వరి వంగడాన్ని అందుకుంటున్న కలెక్టర్

భీమవరం: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలతో, రైతు సాధికార ప్రతినిధులతో కలెక్టర్ చదలవాడ నాగరాణి తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, పకృతి వ్యవసాయ పద్ధతుల గురించి చర్చించారు. తక్కువ ఖర్చుతో వరి ఉత్పాదకత పెంచి, సాగు వల్ల రైతులు లాభపడే సమగ్ర వివరాలు శాస్త్రవేత్తలు అందించారు. ఈ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు పురోగతి విస్తరణ అవకాశాల గురించి చర్చించారు. కలెక్టర్ కు డి ఆర్ ఆర్ ధాన్-48 వరి వంగడాన్ని బహుకరించారు. అధికంగా సూక్ష్మ పోషక జింకు కలిగి, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం ఎవరు ఉండడం ఈ వరి వంగడం యొక్క ప్రత్యేకత. ఇందువల్ల పోషకాహారం, మధుమేహ నివారణ సాధ్యమవుతుంది. ఈ నూతన వరి వంగడం ఆవిష్కరణ వల్ల ప్రజల ఆరోగ్యానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.