Skip to main content

Telugu News Power

రైతు సమస్యలపై ఎట్టకేలకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ముఖ్యమంత్రి, వ్యవసాయాధికారులతో సచివాలయంలో నిర్వహిస్తున్న సమావేశం

అమరావతి: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కష్ట కాలంలో రైతులకు అండగా నిలవాలని వ్యవసాయ అధికారులను, మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన కార్యాచరణ ప్రణాళిక, రైతు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపాతం 69 శాతం లోటు ఉందని, వచ్చే మూడు నెలల్లో కూడా 35-40 శాతం వర్షపాతం లోటు ఉంటున్నట్టు అంచనా వేశారు. జూన్ నుంచి నవంబర్ వరకు 844మి. మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 551మి. మీ వర్షపాతం మాత్రమే కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖల ముందస్తు అంచనాలు చెబుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మేరకు రైతులను సన్నద్ధ పరచవలసిందిగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.