Skip to main content

Telugu News Power

ఉపాధి హామీ, 37 కరువు మండలాలకు, 50 రోజుల పొడిగింపు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి నన్ను సార్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ లోని 37 కరువు మండలాలకు 50 రోజులపాటు ఉపాధి హామీ పథకం పొడిగించినట్టు బుధవారం తెలిపారు.
శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు ప్రకాశం జిల్లాల కరువు ప్రభావిత 37 మండలాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల ఉపాధి ఆమోదించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో అత్యంత సమయోచిత నిర్ణయమని పెమ్మసాని పేర్కొన్నారు.దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి పరిమితి 150 రోజులకు పెరిగి, గ్రామీణ కుటుంబాల జీవన భద్రత మరింత బలపడుతుందన్నారు.
రైతులు మరియు గ్రామీణ వర్గాల అభ్యున్నతికి నిరంతర కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లకు చంద్రశేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తోందని పెమ్మసాని వెల్లడించారు.