అమరావతి: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) పరిశ్రమలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి మీడియా పాయింట్ వద్ద బుధవారం వంక మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి పట్ల ఆ సంస్థ మాజీ చైర్మన్ వంక రవీంద్రనాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ నుంచి కేవలం 20 శాతం మాత్రమే ఎంఎస్ ఎం లకు ప్రోత్సాహకాలు అందాయని వెల్లడించారు. ప్రోత్సాహకాలు అందించే ప్రస్తుత పద్ధతి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎంఈలు సమస్యల్లో ఉన్నవి, సమస్యలు లేనివి గా విభజించి ప్రోత్సాహకాలు అందించడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రభుత్వం పార్టీల పరంగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఇతర పార్టీల వారిని ఇబ్బందులకు గురి చేయటం, రాష్ట్రంలో ఎమ్మెస్ఎంఈ పరిశ్రమలు పెట్టాలనుకునే వారి సంకల్పాన్ని మొగ్గలోనే తుంచి వేస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, వివక్షతో సమస్యలు సృష్టించడం వల్ల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దారుణంగా దెబ్బతీస్తుందని, ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి స్థానిక ఉపాధి కేంద్రాలుగా, ఆర్థిక అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు మీద ప్రభుత్వం సరియైన విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
పరిశ్రమలు కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. -ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.
ఎం ఎస్ ఈ ల విధానంపై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్