Telugu News Power

ఎమర్జెన్సీఉద్యోగంగా మారిపోయిన ఉపాధ్యాయ వృత్తి.

సత్కారం అందుకుంటున్న దేవేంద్రుడు దంపతులు
దేవేంద్రుడు పదవీ విరమణ సభలో మాట్లాడుతున్న ఫ్యాప్టో అధ్యక్షులు సాయి శ్రీనివాస్

యలమంచిలి: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ వృత్తి ఎమర్జెన్సీ ఉద్యోగంగా మారిపోయిందని, రాష్ట్ర ఫ్యాఫ్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు, ఉపాధ్యా ఎమ్మెల్సీ అభ్యర్థి లంకపల్లి సాయిశ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గుంపర్రుఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాల దేవేంద్రుడు పదవీ విరమణ సభ శనివారం జరిగింది. ఈ సభకు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు నాగరాజు సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఉప విద్యాశాఖ అధికారి కెవిఎస్ సత్యనారాయణమూర్తి మరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి, సినిమాల్లో చూపించే ఎమర్జెన్సీడాక్టర్ల పరిస్థితితో పోల్చి చెప్పారు. పరీక్ష పెట్టిన గంటలోనే, ఫలితాలు పంపించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. గంటలోనే డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతారని ప్రశ్నించారు. పాఠశాలలో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే తరగతులు వెళుతుంటే, మిగతా ఉపాధ్యాయులందరూ ఇంటర్నెట్ సేవలు ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారిపోతున్నారని వాపోయారు. ఉపాధ్యాయులు వృత్తి కంటే పదవి విరమణ మంచిది అనే భావం కలుగుతుందన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయుల పరిస్థితి కత్తి మీద స్వాములా తయారయిందన్నారు. ఈ తరుణంలో దేవేంద్రుడు పదవీ విరమణ, డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యమనే పరిస్థితుల్లో జరగటం మంచిదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులకు సంబంధించి కొంత బకాయిలు చెల్లించినప్పటికీ,మళ్లీ ఆ భారం 34 వేల కోట్లకు చేరిందని వెల్లడించారు. ప్రభుత్వం కరిక్యులం, సిలబస్ మార్చే యోచనలో ఉందని, ఇందుకు సంబంధించి విద్యాశాఖామాత్యులు లోకేష్ తో చర్చించినట్టు సాయి శ్రీనివాస్ తెలిపారు. రిటైర్ అయినప్పటికీ ఉపాధ్యాయులు దేవేంద్రుడు సంఘ పటిష్టతకు, విద్యాభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. దేవేంద్రుడు తనకు జరిగిన ఈ సత్కారానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవేంద్రుడు ప్రగతిశీల భావాలను, ముందు చూపును, సహకార గుణాన్ని వక్తులు వేనోళ్ల కొనియాడారు. దేవేంద్రుడు దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో, ఎస్ టి యు నాయకులు, డాక్టర్ ప్రతాప్ రాజు, చిట్టిబాబు, రామచంద్రరావు, సాయి వర్మ, సురేష్ బాబు, కంబాల సత్య శ్రీ, అమూల్య, మాజీ జెడ్పిటిసి బోనాలు నాని, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు అడ్డాల వాసుదేవరావు, అడ్డాల సత్యనారాయణ, డేగల సూర్యప్రభ వెంకటేశ్వరరావు దంపతులు, వలవల యజ్ఞం ప్రసాద్, శేష సాయి, దేవేంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న.