
యుద్ధక్షేత్రం: మార్చి,1 (తెలుగున్యూస్‌పర్.కామ్) ప్రస్తుతం, భీకర పోరు సాగుతున్న, ఇరాన్-ఇశ్రాయెల్ మధ్య ఘర్షణ, మధ్యప్రాచ్య ప్రాంతంలో తీవ్ర రూపం దాలుస్తుంది. ఇటీవల ఇశ్రాయెల్ సైన్యం ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ అధికారులు ఈ దాడులకు ప్రతీకారంగా ఇశ్రాయెల్‌పై క్షిపణులు దూసుకెళ్లాయని ప్రకటించారు.ఈ ఘర్షణకు కారణం ఇశ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో హమాస్ సంస్థపై గాజా పట్టిలో చేసిన దాడులు. ఇరాన్ మద్దతుగా హిజ్బుల్లా, హౌతీ సంస్థలు కూడా ఇశ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య ఈ దాడుల్లో వందలాది మంది మరణించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇశ్రాయెల్‌కు మద్దతుగా నిలబడ్డారు. యూరోపియన్ యూనియన్ శాంతి చర్చలకు పిలుపునిచ్చింది. ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, చమురు ధరలకు ప్రభావం చూపుతున్నది. ఇజ్రాయిల్ ప్రయోగిస్తున్న సైనిక దాడుల వల్ల వందలాది మంది అమాయక పౌరులు, పాఠశాల విద్యార్థులు మరనిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి ఈ పరిస్థితులు దారితీయవచ్ఛుని ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంది. ఇరాన్ సుప్రీం ఆయత్తుల్లా ఖొమైని ని అంతమొందించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఖండించిన ఇరాన్, ఒక రోజు తర్వాత ఖొమైని మరణాన్ని నిర్ధారించింది. ఖొమైని 86 ఏళ్ల వయసు లో కూడా అమెరికా, ఇజ్రాయిల్ సైనిక శక్తిని ఎదిరించి పోరాడారు. ఇరాన్ సర్వ శక్తివంతుడుగా 36 ఏళ్ళు అప్రతిహతంగా పాలన సాగించారు. వీరి తాత్కాలిక వారసునిగా ఆయతుల్లా ఆరిఫ్ బాధ్యతలు చేపట్టనున్నట్టు ఇరాన్ ప్రకటించింది.