యలమంచిలి: మార్చ్,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మూవస్థానేశ్వరి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అఖండ అన్నసమారాధన జరిగింది. వేలాది మంది భక్తులు మహా ప్రసాదం స్వీకరించడానికి, పరిసర గ్రామాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చారు. నిర్వాహకులు 15 వేల మంది వరకు వస్తారని అంచనా వేసారు. మాంసాహార, శాఖాహార మహా ప్రసాదం వడ్డించారు. దాదాపు వెయ్యి కేజీల మటన్, 800 కేజీల చికెన్ తో వంటకాలు సిద్ధం చేశారు. భారీగా జరిగిన ఈ కార్యక్రమంలో, నిర్వాహకులు తాడూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, తమ్మినీడీ చక్రవర్తి, తాళ్లూరి వెంకటేశ్వరరావు, బొప్పన రాంబాబు, బొప్పన శివ, రావూరి మురళి,మేక శేషు, చిలుకూరి సాయి, ఆకుల యేసు, కూర్మా రావు, చిలుకూరి శ్రీనివాస్, కత్తర్ శ్రీనివాస్,యాతం దానయ్య, నందమూరి శ్రీను, కాసా సత్య, అబ్బు, ఆడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కమిటీ కుర్రాళ్ళు తో సేవలు అందించారు. ఇంటి గ్రామాల నుంచి వచ్చిన పలువురు మాతలు వడ్డన లో తమ సేవలు అందించారు. భక్తులకు సౌకర్యవంతంగా టేబుల్ మీల్స్, కూల్ డ్రింక్ తో సహా సంతృప్తికరంగా ఆహార పదార్థాలు అందించారు.
మూలస్థానేశ్వరి అమ్మవారి అఖండ అన్న సమారాధన.
శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి మహా ప్రసాద వితరణ