
భీమవరం: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భీమవరం, పరిసర గ్రామాల భక్తులు నిరంతరం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మహిళా భక్తులు సుమారు 2000 మంది పైగా పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 కేజీలు పైగా మిఠాయిలు, పండ్లు, చలివిడి తదితరాలు సమర్పించారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా, సుమారు 1500 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు.చైర్మన్ బొండాడ నాగ భూషణం అన్నదాన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సారె సమర్పించిన భక్తులకు దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన మహిళా సేవకులు భీమవరం వాస్తవ్యులు మద్దాల విజయలక్ష్మి,, గూట్లపాడు కు చెందిన కొప్పర్తి దేవిఆదిలక్ష్మి లకు దేవస్థానం చిరు సత్కారం చేశారు.ఆద్యంతం భక్తి భావం తొనికిసలాడుతుండగా ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ అపూర్వ, అపురూప, సారె సమర్పణ గ్రామోత్సవం పట్టణంలో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. కన్నుల పండుగగా జరిగిన ఈ ఊరేగింపు చూసిన భక్తులు జన్మ ధన్యమైందని తన్మయత్వంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులతో పాటు ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగశిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గుణేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.