Skip to main content

Telugu News Power

నిత్యాన్నదాన పధకానికి పళ్ళాలు, కుక్కర్ బహుకరణ.

భోజనం పళ్ళాలు, కుక్కర్ బహూకరణ దృశ్యం

పాలకొల్లు:ఆగష్టు,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకంలో భక్తులు భోజనము చేయుటకు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి అన్నదాన కమిటీకి చెందిన కుంచె సూరిబాబు, 270 స్టీల్ ప్లేట్లు దేవస్థానమునకు అందజేసారు. నిత్యఅన్నదానం తయారు చేయుట లో ఉపయోగించుటకు 20 లీటర్ల ప్రెస్టేజ్ కుక్కర్ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యులు, జక్కంపూడి కుమార్ దేవస్థానము నకు అందజేసారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు,ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పినిశెట్టి శ్రీనివాస్, నాళం బాబి,జక్కంపూడి కుమార్,కుంచె సూరిబాబు,సూపర్నెంట్ వాసు, హోత హరి నారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.